ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఊహించని విధంగా ప్రస్తుతం బిజెపి ముందంజలో కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం అయ్యే ముందు తెలంగాణ ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్  ప్రస్తుతం సంచలన గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ గుర్తు కాకుండా పెన్నుతో వేసిన మార్క్ ఉన్న   కూడా  ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ జారీ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సరిగ్గా ఎన్నికల కౌంటింగ్ జరిగే ముందు కావాలని ఎన్నికల సంఘం ఇలాంటి సర్క్యులర్ జారీ చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.



 అంతేకాదు ఎన్నికల సంఘం తీరుపై కోర్టుకు కూడా ఆశ్రయించారు. ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చినందువల్లే టీఆర్ఎస్కు ఫేవర్ గా ఉండే విధంగా రాత్రికిరాత్రి ఎన్నికల కమిషన్ ఈ సర్క్యులర్ జారీ చేసింది అంటూ బిజెపి ఆరోపించింది. ఈ సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలి అంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఎన్నికల కౌంటింగ్ ను తాము అడ్డుకోబోమని అంటూ స్పష్టం చేసిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.. ఇలా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు గుణపాఠం తప్పదు అంటూ హెచ్చరించారు. అయితే ఎన్నికల పోలింగ్ శాతం పై కూడా ఎన్నికల సంఘం ఇదే తీరులో వ్యవహరించిందని అంటూ ఆరోపించారు.



 మధ్యాహ్నం మూడు గంటల వరకు గంటగంటకు పోలింగ్ శాతం యొక్క వివరాలు ఇచ్చినప్పటికీ సాయంత్రం 5 నుంచి 6 గంటల నడుమ పోలింగ్ శాతం ఎన్నికల సంఘం వెల్లడించడం వెనుక అంతర్యం ఏమిటి అంటూ ప్రశ్నించింది. అర్ధరాత్రి దాకా ఎందుకు సమయం పట్టిందో చెప్పాలి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన పోలింగ్ కు టిఆర్ఎస్ ఓ పథకం ప్రకారం వేసింది అంటూ ఆరోపించారు బండి సంజయ్. టిఆర్ఎస్ కు అనుకూలంగా పోలింగ్ శాతం  మార్చేందుకు కుట్రలు పన్నారు అంటూ బండి సంజయ్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: