ప్రస్తుతం ఎన్నో రకాల ఆన్లైన్ పేమెంట్ యాప్ లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే రోజు రోజుకూ తమ వినియోగ దారులను పెంచుకునేందుకు అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్ లను కూడా ప్రకటిస్తున్నాయి ఎన్నో ఆన్లైన్ పేమెంట్ సంస్థలు. ఇక ఎన్నో రకాల ఆకర్షనీయమైన ఆఫర్లతో ప్రకటిస్తూ తమ ఆన్లైన్ పేమెంట్ యాప్ ద్వారా పేమెంట్ చేసుకునేందుకు మొగ్గు చూపేలా ఆకర్షిస్తున్నాయి.  ఇటీవలే అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది అమెజాన్. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలనుకుని ఆలోచించే వారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి అదిరిపోయే ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.



 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై  ప్రస్తుతం అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్ లు కూడా ప్రస్తుతం ఎంతో మందికి అందుతున్నాయి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలనుకునేవారు దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసేందుకు అవకాశం ఉంది. దీనికోసం అమెజాన్ లో కి వెళ్లి అక్కడ పే బిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేసి గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ గ్యాస్ ఆపరేటర్ను కూడా ఎంచుకోవాలి తర్వాత ఎల్పీజీ లేదా  రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి... అమెజాన్ పే ద్వారా బిల్లు చెల్లిస్తే సరిపోతుంది.



 ఇలా అమెజాన్ పే ద్వారా బిల్లులు చెల్లించడం ద్వారా 50 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతే కాకుండా మరో డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎంలో కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలి అనుకునే వారు ఒకవేళ డిజిటల్ వాలెట్ సంస్థ పేటియం ద్వారా ఒకవేళ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే 500 రూపాయల వరకు క్యాష్బ్యాక్ వచ్చే అవకాశం ఉంది.  అయితే మొదటిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఎంతోమంది గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలి అనుకునే వారు ఇలా వివిధ వాలెట్ ల  ద్వారా బుక్ చేసి క్యాష్బ్యాక్ పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: