కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని రంగాలు కూడా కుదేలై పోయాయి.  కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న నేపథ్యంలో ఇక అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన  నేపథ్యంలో అన్ని రంగాలు కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి  అన్న విషయం తెలిసిందే. కనీసం ఆయా రంగాల్లో రోజువారీ కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది కరోనా వైరస్ కారణంగా. ఇక కరోనా వైరస్ కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి అన్న విషయం తెలిసిందే.




 రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి లో ఉన్న ఎంతోమంది నిరుపేదలకు ఉపాధి కరువై కనీసం కుటుంబ పోషణ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఉపాధి కోసం సొంత ప్రాంతం వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది ఉపాధి కోల్పోవడంతో చివరికి ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సమయంలో ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఎంతగానో చితికిపోయారు. అయితే ఇప్పటికి కూడా కరోనా వైరస్ క్రైసిస్ నుంచి ఎంతోమంది తేరుకోలేక పోతున్నారూ  అనే విషయం తెలిసిందే.



 కరోనా వైరస్ కష్టకాలంలో ఎంతోమందికి అండగా నిలిచి ఉపాధి చూపించింది వ్యవసాయ రంగం. కరోనా కష్ట కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను తట్టుకునేలా వ్యవసాయ రంగం అండగా నిలిచింది. ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఎప్పుడూ లాభాల్లో ఉండే పారిశ్రామిక సేవా రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి అంటూ కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇలా అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో వ్యవసాయ రంగం మాత్రం 3.4 శాతం వృద్ధిరేటు సాధించడం శుభ పరిణామం అంటూ చెప్పుకొచ్చారు. ఖరీఫ్ కోతలు రబి  విత్తనాలను  కరోనా  ఎలాంటి ప్రభావితం చేయలేకపోయింది అంటూ తెలిపింది. ఇదే సమయంలో ఎంతో మందికి వ్యవసాయ ఉపాధి కల్పించని ట్రాక్టర్ల అమ్మకాలు కూడా పెరిగాయి అంటూ తెలిపిన కేంద్ర ఆర్థిక శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: