ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా  వైరస్ పట్టి పీడిస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం అనివార్యంగా మారిపోయింది కేవలం దేశం ప్రాంతం అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తం ప్రస్తుతం మాస్క్  ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎప్పటికప్పుడు ప్రపంచ ప్రజానీకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పుడూ సూచనలు సలహాలు ఇస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే.



 కేవలం ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రమే కాదు ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని సూచిస్తున్నారు. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని అలా అయితేనే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యం అవుతుంది అంటూ సూచిస్తున్నారు ఎంతోమంది. ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మాస్క్ ధరించడం పై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఏసీ కార్లు  ఏసీ గదులలో ఎక్కువ మంది జనాలు అలవాటు పడిన నేపథ్యంలో ఇలా ఏసీ గదుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.



 కరోనా కట్టడి పై మాస్కులు ధరించే  అంశంపై ఇటీవల కీలక సూచనలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఏసీ కారులు ఏసీ గదుల్లో ఉండే వాళ్ళు తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఏసీ గదుల్లో ఉన్న వారు గాలి ద్వారా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని అందుకే తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని సూచించింది. లేనిపక్షంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు మీదికి వచ్చే అవకాశం ఉంది అంటూ హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతేకాకుండా బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి అని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: