ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు  వెలువడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభమైంది. శరవేగంగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కింపు జరుపుతున్నారు 30 కేంద్రాల్లో 166 టేబుల్ను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఈ క్రమంలోనే ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు విజయం సాధిస్తారు అన్నదానిపై ప్రస్తుతం అందరి అభ్యర్థుల్లో కూడా టెన్షన్ నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అందరూ అభ్యర్థులు కూడా ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అటు బీజేపీ పెద్దలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




 అయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభం కాగా బిజెపి ముందంజలో కొనసాగుతూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే పోలింగ్ పూర్తయిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో  జిహెచ్ఎంసి ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి అన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే బిజెపి గట్టి పోటీ ఇస్తుంది అని కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో  నిజమైన ఫలితాల్లో  మాత్రం ఎలాంటి అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి   అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది. కాగా జిహెచ్ఎంసి ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా... అన్ని పార్టీలు కూడా మేయర్ పీఠం తమ పార్టీని దక్కించుకుంటుందని  ధీమాతో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఈ సారి మేయర్ పీఠాన్ని దక్కించుకునే  పార్టీ ఏది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ శరవేగంగా జరుగుతోంది డివిజన్ల వారీగా ఫలితాలను వెల్లడించారు ఎన్నికల అధికారులు ఎవరు విజయం సాధిస్తారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల చూపును  మొత్తం జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు ఆకర్షించాయి. ఈ నేపథ్యంలోనే కౌన్ బనేగా హైదరాబాద్ బాద్ షా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: