తెలంగాణా ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పెన్నుతో టిక్ పెట్టినా సరే దానిని సరయిన ఒట కిందనే లెక్క వేయాలని ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవలని ఎన్నికల సంఘానికి హైకోర్టు అదేశించింది. బీజేపీ నేతలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. 


వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు అదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారం కు వాయిదా వేసింది హైకోర్టు.అయితే ఎలక్షన్ కమిషన్ సర్క్యూలర్ ను సస్పెండ్ చేసిన హైకోర్టు...  గెలుపోటముల దగ్గర మార్కింగ్ ఉంటే తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఆదేసిన్సింది. అయితే ఇంకా హైకోర్టు ఉత్తర్వులు అంద లేదంటున్న ఎలక్షన్ కమిషన్, స్వస్తిక్ సింబల్ పై ఎలాంటి క్లారిటీ అధికారులు ఇవ్వడం లేదు. 


దీంతో బిజెపి ఏజెంట్లు  ఆందోళనలో ఉన్నారు. మరో మారు ఈ విషయం కోర్టుకు తీసుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారు. ఇక మరో పక్క గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపు పై బీజేపీ అభ్యంతరం చెబుతోంది. బూత్ నెంబర్ 8లో పోలైన ఓట్లు 471 కాగా బాక్స్ లో మాత్రం 257 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మిగతి ఓట్ల గల్లంతు పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. పోలింగ్ శాతం తప్పు గా వెల్లడించామంటున్నారు అధికారులు. అయితే కోర్టు ఆదేశాలు పాటిస్తే టీఆర్ఎస్ కు, ఆదేశించక పోతే బీజేపీకి నష్టం అని అంటున్నారు విశ్లేషకులు. 


 





 



మరింత సమాచారం తెలుసుకోండి: