గ్రేటర్ ఎన్నికల ఫలితాలు నేడు ... దేశం మొత్తం చూపు గ్రేటర్ ఎన్నికల ఫలితాల వైపే ఉంది ..బీజేపీ నాయకుల  ఢిల్లీ లో ఉండి  గ్రేటర్ ఎన్నికల ఫలితాలను ఆతృతగా చూస్తున్నారు .. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి అన్ని పార్టీల నాయకులూ మానిఫెస్టో రూపకల్పనలో బిజీ అయ్యారు అంతేకాదు  అభ్యర్థుల ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు .. తమ పార్టీ అజెండాని   ఉపన్యాసాల ద్వారా ప్రజలకి  తెలియజేసారు ...

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి.. మేయర్ పీఠం ఎవరిది అన్నది తెలియాలంటే కేవలం కొన్ని గంటలు మిగిలి ఉన్నాయి ఈ పీఠం పై ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు... ఉదయమే మొదలైన ఓట్ల లెక్కింపు 150 వార్డుల్లో ఇంకా కొనసాగుతుంది .. ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు కోసం  అన్ని ఏర్పాట్లను  చేసింది ..  ఒక్కో హాల్లో 14 కౌంటింగ్ టేబుల్స్ ని సిద్ధం చేసింది .. రౌండ్ కి వెయ్యి చొప్పున 14 వేల ఓట్ల లెక్కించనున్నారు ..

అయితే కౌంటింగ్ లో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు .. ఇప్పటికే ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
లెక్కింపు  ఇంకా కొనసాగుతుంది..

అయితే తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తికావస్తుంది.. అయితే ఇందుకు సంబందించిన ఫలితాలు  11 గంటల తర్వాతే  వచ్చే అవకాశం కనబడుతుంది .. ఇప్పటికే మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని సమాచారం..

ఈనెల 1న తేదీన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగగ  ఈరోజు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు.. 150  వార్డులకి గాను   ఒక్క వార్డు మినహా 149 పోలింగ్ జరగగా ఆ ఒక్క వార్డులోను  నిన్న ఎన్నికల కమిషన్ రీపోలింగ్ ని నిర్వహించింది . అయితే ఫలితాలు ఈ సాయంత్రానికి రానున్నాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి: