నిన్నటి వరకు ఉత్కంఠగా సాగిన గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఈరోజు లో వెలువడనున్నాయి.. ఇప్పటికే మొదటి ఫలితాలను లెక్కించిన ఈసి మెహదీపట్నం ఫలితాలను విడుదల చేసింది.. ఈ మేరకు ఎన్నికల ఫలితాల కోసం నగరం మొత్తం ఆసక్తి కనబరుస్తోంది.. ఈ ఎన్నికల్లో తమదే విజయం అంటూ టీఆరెఎస్ నేతలు ముందస్తుగా పార్టీ కార్యాలయం లో సంబరాలు జరుపుకుంటున్నారు.. ఒకవైపు ఎన్నికల కోసం హోరా హోరీగా ప్రచారం లో పాల్గొన్న నేతలకు ఈ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది.



 ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవబోతోందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేసారు. ఈ రోజు ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో, మంత్రి కేటీఆర్ పనితీరుతో ప్రజలు అత్యధిక మెజారిటీతో టీఆర్ఎస్‌ను గెలిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని ఆమె  నేడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు... నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్‌కు అనుకూలం గానే వచ్చాయని ఆమె స్పష్టం చేసారు. 
 


వందకు పైగా స్థానాలు వస్తాయని కవిత ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా మళ్లీ జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురుతుందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ లో 80 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. 35 స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది. తప్పకుండా మళ్లీ జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురుతుందని కవిత మరోసారి స్పష్టం చేశారు... ఈ ఎన్నికలు ఫలితాలు ప్రజలు ఎప్పుడో నిర్ణయించాయి.. గెలుపు ఖాయమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.. సాయంత్రం సంబరాలకు ప్రజలు నేతలు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు.. బీజేపి లాంటి మాటలు చెప్పే పార్టీలు ఎప్పటికీ ప్రజల మనసును గెలుచుకోలేవని స్పష్టం చేశారు...

మరింత సమాచారం తెలుసుకోండి: