గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు  ప్రారంభం అయింది.. ఇప్పటికే తొలి రౌండ్ పూర్తి చేసుకున్నా,  రెండో రౌండ్ ని కూడా ప్రారంభించింది ..అయితే తొలి రౌండు లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే లెక్కిస్తున్న తరుణంలో పోస్టల్ బ్యాలెట్ లలో అనూహ్యంగా బిజెపి పార్టీ ముందుకు దూసుకుపోతుంది..

ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో బిజెపి 87 స్థానాలలో  అగ్రస్థానంలో ఉండగా, టిఆర్ఎస్ 33 , ఎంఐఎం 17 , కాంగ్రెస్ 2 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నవి.. అయితే గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల ఫలితాలలో బీజేపీ అభ్యర్థులు ముందుకు దూసుకుపోతున్నారు అని  అన్నారు.. గ్రేటర్ ఎన్నికల్లో మేమే విజయం సాదించబోతున్నామని  అయన తెలిపారు .. గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో  బీజేపీ అగ్రస్థానంలో  దూసుకుపోతున్న తరుణంలో  మేయర్ పీఠం భారతీయ జనతాపార్టీ దేనంటూ రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా బీజేపీ  పార్టీకి ఓటు వేసిన ప్రజలకు రాజా సింగ్ ధన్యవాదాలు తెలిపారు..

గ్రేటర్ ఎన్నికల ఫలితాలలో ఆధిక్యంలో తెరాస మరియు బీజేపీ పార్టీ పోటా పోటీగా తలపడుతున్నాయి .. ఇప్పటి వరకు వెలువడిన తోలి రౌండ్ ఫలితాలలో కొన్ని వార్డుల్లో తెరాస ముందంజలో ఉండగా ,ఆ తర్వాతి స్థానంలో బీజేపీ ఉండటం విశేషం .. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ ప్రచారాలతో మరియు సభలతో హోరెతించింది .. పార్టీ ప్రముఖుల చేత ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది .. రోడ్ షోలను చేపట్టింది ..పార్టీ అధ్యక్షుడైన బండి సంజయ్ మరియు రాజా సింగ్    నిత్యం అభ్యర్థులతో కలిసి ప్రచారం లో పాల్గొన్నారు ..గ్రేటర్ ప్రచారాన్ని   ముందుండి నడిపించారు ..

అయితే ఈ గ్రేటర్ సమరం లో భారీ ఎత్తున ప్రచారాలను చేస్తూ  మరియు ప్రజలకి ఉపయోగపడే విధంగా మేనిఫెస్టో ని రూపొందించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో బీజేపీ నాయకులూ విజయం సాధించారనే చెప్పాలి .. ఈ సారి  ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికార ప్రభుత్వం పై తప్పులను ఎత్తి చూపుతూ తాము అధికారం లోకి వస్తే ఆ తప్పులను సరి చేస్తామని  ప్రసంగాల రూపంలో తమ వాణిని గట్టిగ వినిపించాయి ..అంతే కాదు ఎన్నికల ప్రచారం నుండే మేయర్ పీఠం తమదే అంటూ చెప్పడం చుస్తే ఈసారి ఎన్నికలో ఫలితాలలో తెరాస ని పక్కకు నెట్టి తాము మేయర్ పీఠం ఎక్కేలా కనబడుతుంది  .. చూడాలి మరి సాయంత్రం నాటికీ ఒక కొలిక్కి వచ్చే ఓట్ల లెక్కింపు. ఎవరు గెలిచారు ఎవరు మేయర్ పీఠం పై ఎక్కబోతున్నారు  అనేది విషయం  తెలుస్తుంది .. 

మరింత సమాచారం తెలుసుకోండి: