ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఎంతో  శరవేగంగా జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు అయితే మొదట పోస్ట్ బ్యాలెట్ పత్రాలు లెక్కించిన సమయంలో బిజెపి ఆధిక్యంలో ఉండగా ఆ తర్వాత బ్యాలెట్  పత్రాల లెక్కింపు తో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుంది.  ప్రస్తుతం భారీ  స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ కూడా టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుంది ఇక శరవేగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది అనే విషయం తెలిసిందే.


 అయితే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా సమస్యాత్మకమైన ఓటింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ మరింత నిఘా ఏర్పాటు చేశారు ప్రస్తుతం సీసీ కెమెరాల నిఘాలో  ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక పలు  కౌంటింగ్ కేంద్రాలలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఓట్లు గల్లంతు అయ్యాయని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నాయి.



 కాగా మౌలాలి డివిజన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ముందుగా అధికారులు గుర్తించిన దానికంటే బాలెట్ బాక్స్ లో 33 ఓట్లు అధికంగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 361  ఓట్లు ఉండగా బ్యాలెట్  బాక్స్ లో  394 ఓట్లు ఉన్నాయి. దీంతో ఏకంగా 33 ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో కీలక నిర్ణయం తీసుకున్న కౌంటింగ్ చేస్తున్న అధికారులు కౌంటింగ్ ను నిలిపివేశారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కౌంటింగ్ చేయబోము అంటూ తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: