జీఎచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.క్షణక్షణం సమీకరణాలు మారుతూ పార్టీలకు గెలుపు దొబుచ్చులాడుతుంది.అయితే మొదట ఎన్నికల కౌంటింగ్ ప్రారంభ దశలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా.. టీఆర్‌ఎస్‌పార్టీ  రెండో స్థానంలో నిలిచింది.దాంతో బి‌జే‌పి కార్యకర్తలకు గెలుపు పై ఆశలు చిగురించాయి.అయితే మొదటి రౌండ్ అసలైన ఫలితాలు వచ్చే సరికి మొత్తం సమీకరణలు మారిపోయి అనూహ్యంగా టి‌ఆర్‌ఎస్ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.అప్పటినుండి టి‌ఆర్‌ఎస్ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ విజయం దిశగా అడుగులు వేసింది.

టి‌ఆర్‌ఎస్ పార్టీ 150 స్థానాలకు గాను దాదాపుగా 71 స్థానాలలో పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తుంది.బి‌జే‌పి 38 స్థానాలలో ఆధిక్యాన్ని కనబరుస్తూ గెలుపు రేసులో వెనకబడింది.దాదాపుగా ఫలితాలు స్పష్టం అవుతుండడంతో టి‌ఆర్‌ఎస్ గెలుపు ఖాయమయ్యేట్టుగా కనిపిస్తుంది.దీంతో ఫలితాలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.బి‌జే‌పి సీట్లు తగ్గడానికి ముఖ్య కారణం సోషల్ మీడియా నే అని మండిపడ్డారు.టి‌ఆర్‌ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో బి‌జే‌పి నాయకుల పైన తప్పుడు ప్రచారాలు చెయ్యడం వల్లే మా పార్టీకి పరాభవం ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు.

వరద భాదితులకు కే‌సి‌ఆర్ సహయంగా ప్రకటించిన 10 వేలు పంచకూడదని బి‌జే‌పి రాష్ట్ర అద్యక్షుడు లేఖ రాసినట్టుగా   సోషల్ మీడియా ద్వారా మాపై విష ప్రచారం చేశారు. అందువల్లే బి‌జే‌పికి రావలసిన సీట్లు తగ్గినాయని మండిపడ్డారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టినట్టుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి చివరకు ఆంధ్ర రాయలసీమ ఓటర్లను కూడా మా నుండి తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా ముమ్మాటికీ టిఆర్ఎస్ చేసిన కుట్ర అని బి‌జే‌పి నేత,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: