జీఎచ్‌ఎంసీ ఎన్నికల కారు జోరు కొనసాగుతుంది.150 స్థానాలకు గాను 72 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది.నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కొద్దిగా అటు ఇటూగా అన్నీ స్థానాల్లోనూ అదే ఫలితాలను రాబడుతుంది.అల్మోస్ట్ ఇప్పుడున్న లీడ్ ప్రకారం బల్దియా పీఠం టి‌ఆర్‌ఎస్ కు కైవసం అయినట్టుగా తెలుస్తుంది.దీంతో టి‌ఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లోనూ,కార్యకర్తల్లోనూ సంబరాలు మిన్నంటుతున్నాయి.ఏ డివిజన్ చూసిన గులాబీ రంగు జెండా లతో సంబరాలు జరుపుతున్నారు.

టి‌ఆర్‌ఎస్ చేసిన అభివృద్ది వల్లే ప్రభుత్వం పైన ప్రజలు సానుకూల దృక్పథంతో వున్నారు.కాబట్టి మళ్ళీ కూడా బల్దియా పీఠాన్ని టి‌ఆర్‌ఎస్ కే కట్టబెట్టరాని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఆయా డివిజన్ల వారీగా స్పష్టమైన ఆధిక్యంతో టి‌ఆర్‌ఎస్ గెలిచిన స్థానాల వివరాలు చూసినట్లైతే ..  సనత్‌ నగర్‌ డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కొలను లక్ష్మి రెడ్డి దాదాపు 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా  భారతినగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది.

 ఆ పార్టీ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి సుమారు 3900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.కుత్బుల్లాపురం డివిజన్లో  టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాతం సుమారు 2025 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు.రంగారెడ్డి నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి విజయ్‌శేఖర్ గౌడ్‌ విజయం సాధించారు. కూకట్ పల్లి అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.ఇంకా మెదిగుట్ట,యూసఫ్ గూడ బొరబండ వంటి డివిజన్లలో స్పష్టమైన ఆధిక్యంతో టి‌ఆర్‌ఎస్ పార్టీ గెలుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: