తండ్రి,కొడుకులు అహంభావాన్ని దించారు

ఎంపీ అర్వింద్

హైదరాబాద్: రాష్ట్రంలో తండ్రి కేసీఆర్, కుమారుడు కేటీఆర్ అహంభావాన్ని, ఒంటెద్దు పోకడలను దించాలని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలే నిర్ణయించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ అహంభావ ప్రభుత్వ వైఖరితో ప్రజలు విసిగిపోయారని, ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందని అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో అవినీతి చాలా పెరిగిపోయిందని, తండ్రీ కొడుకుల బలుపును దించాలని ప్రభుత్వం నిర్ణయించే ఓట్లు వేశారన్నారు. సీఎం గా పాలన చేయమని ప్రజలు రెండు సార్లు గెలిపిస్తే సచివాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచి పాలన చేస్తున్నాడని, సచివాలయనికి వెళ్లని వ్యక్తి సీఎం పదవికి అర్హుడా అని అర్వింద్ ప్రశ్నించారు. ఉద్యోగులను కూడా మోసగించాడన్నారు. వారి సమస్యలపై కనీసం చర్చలకు కూడా పిలవడం లేదన్నారు. ఉద్యోగులు బీజేపీ వైపే ఉన్నారని, పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ కే ఎక్కువ వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు.

రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, యువతను సీఎం కేసీఆర్ నిండా మోసం చేసిన మోసగాడన్నారు. ఆరేళ్లుగా వీటిని గమనించిన ప్రజలే గ్రేటర్ లో తగిన బుద్ధి చెప్పారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో గెలుస్తామని, 2023 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా 2024 లో 15 ఎంపీ స్థానాలు గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తామని అర్వింద్ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: