హైదరాబాద్ నగరంలో గులాబీ జెండా జోరు కొనసాగుతోంది.. వెలువడిన ఫలితాల్లో కారు జోరు కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో తెరాస నేతలు విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే 75 స్థానాల్లో కారు ముందంజ లో ఉండగా, కేవలం 33 స్థానాల్లో కమలం విజయాన్ని అందుకుంది. అందుతున్న సమాచార ప్రకారం గ్రేటర్ ఎన్నికల్లో టీఆరెఎస్ పార్టీ గెలుపు వైపు దూసుకెళ్తుంది.. ఎక్కడ చూసినా కారు స్పీడ్ పెరుగుతుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కారు జోరు కొనసాగుతుంది. నగరమంతా గులాబీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.



ప్రజలకు కేసీఆర్  ప్రభుత్వం పై నమ్మకం ఉంది..భారీ మెజారిటీ తెరాసాదే అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు.. అది కేవలం తెరాస వల్లనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అందుకే ఇప్పుడు ఎన్నికల్లో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేసింది. ఉత్కంఠభరితంగా సాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా కొన్నిచోట్ల భావోద్వేగ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.



ఇక పోతే భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న వారు సంబరాలు ప్రారంభించారు. కొంతమంది విజయం సాధించి.. విజయోత్సవాలు చేసుకుంటున్నారు. తాజాగా ఆర్ సి పురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప భారీ మెజార్టీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నర్సింగ్ గౌడ్‌ పై 3459 ఓట్లతో పుష్ప విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కార్యకర్తల తో కలిసి ఆమె సంబరాల్లో మునిగిపోయారు. ఆనందోత్సాహంతో ఆమె భర్త నగేశ్ యాదవ్ అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టి అభినందించారు.. అనంతరం మీడియాతో పుష్ప మాట్లాడుతూ.. నా పై నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సమస్యలపై పోరాడతానని ఆమె అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న తెరాస నేతలు పంతాన్ని నెగ్గించుకున్నారు. బీజేపి పై భారీ మెజారిటీతో గెలుపొందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: