గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొంత మంది నేతలను సమర్థవంతంగా వినియోగించుకుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే మరికొంతమంది విషయంలో మాత్రం ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజా సింగ్ లాంటి సమర్థవంతమైన నేత ఉన్నా సరే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో గాని పాతబస్తీలో గాని సమర్థవంతంగా ఆయనను వినియోగించుకోలేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. పాతబస్తీ ప్రాంతాల్లో ఆయన పెద్ద ఎత్తున పర్యటనలు చేసి ఉంటే భారతీయ జనతా పార్టీకి మరిన్ని స్థానాలు వచ్చి ఉండేవి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

ఎంఐఎం కు దీటుగా ఆయన గట్టిగా సమాధానం చెప్పగలిగే నేత. అయినా సరే ఆయన విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా వరకు కూడా విఫలమైంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ కొన్ని కొన్ని తప్పులు చేసినా సరే వాటిని భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లలేకపోయింది. ఇక మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఘోరంగా వెనుకబడి ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టిఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉన్నా సరే ఆ బలాన్ని సమర్థవంతంగా వాడుకోలేదు.

కానీ దానిని కూడా భారతీయ జనతా పార్టీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో సమర్ధవంతంగా వినియోగించుకోలేదు. పూర్తిస్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రచారం చేసి ఉంటే పాతబస్తీలో భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాల్లో సాధించే అవకాశం ఉండేది  అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో అయినా సరే అలాంటి నేతలను వాడుకుంటారా లేదా అనేది చూడాలి. మరి కొంతమంది నేతలు విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆశించిన విధంగా ముందుకు వెళ్లలేక పోయింది అనే వ్యాఖ్యలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: