త్వరలో నే కరోనా వ్యాక్సిన్
అఖిలపక్ష సమావేశం లో ప్రధాని
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతోందని, త్వరలో నే ప్రజలకు అందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
త్వరలోనే కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని నిపుణులు పెద్ద నమ్మకంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మందుకు ఆమోదం లభించిన వెంటనే దేశంలో ప్రజలకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు.అయితే వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్, వృద్ధులకు తొలి ప్రాముఖ్యత ఇస్తామని ఆయన వివరించారు. కరోనా వైరస్ పరిస్థితులపై ప్రధాని మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ కు అనుభవం, నెట్ వర్క్ ఉందన్నారు. వ్యాక్సిన్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

ఈ వీడియో కాన్ఫరెన్కస్ లో గులాం నబీ ఆజాద్, సుదీప్ బందోపాధ్యాయ, శరద్ పవార్, నామా నాగేశ్వర్ రావు, వినాయక్ రౌత్, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, హర్షవర్థన్, ప్రహాద్ జోషి, అర్జున్ రామ్ మేఘావాల్, వి.మురళీధరన్ హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: