గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీని సంక్షేమ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ఆదుకోలేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నామని అది తమ ప్రభుత్వ ఘనత అని టిఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు చెప్పినా సరే ప్రజల్లో మాత్రం ఆ ప్రభావం ఎక్కడ కనపడలేదు. చాలా వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొన్ని కొన్ని విషయాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చింది. అయినా సరే ఆ పార్టీ అనుకున్న విధంగా పరిస్థితులు కనబడలేదు.

 టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొన్ని అంశాల విషయంలో చాలా వరకు కూడా తప్పులు చేసింది అనే భావన చాలా మందిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం లేదని అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగడం లేదు అనే విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా పార్టీ ఘోరంగా విఫలమైంది. సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం సోషల్ మీడియా ఎక్కువగా వాడుకలేకపోయారు.

 పార్టీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా తమ తమ ప్రాంతాల్లో ఎక్కువగా సోషల్ మీడియాను వాడుకోలేక పోవడం టిఆర్ఎస్ పార్టీని ఎక్కువగా దెబ్బకొట్టింది. సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా వరకు కూడా ప్రజలు పెద్దగా ఆసక్తి లేరని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇస్తుంది అనే భావన లోనే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం అనేది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇన్ని రోజులు లేని అభివృద్ధి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తుంది అని చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: