గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడం వెనుక ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనే భావన చాలా మందిలో ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు ఏంటి అనేది తెలియకపోయినా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ పోటీ చేయడం వెనుక చాలా వరకు విస్మయం వ్యక్తం చేశారు. ఆ పార్టీ కార్యకర్తలు ఒకవేళ పోటీచేయకుండా ఉన్న మంచిదే అనే భావన వ్యక్తం చేసారు అనే చెప్పాలి.

చాలా మంది పార్టీ కార్యకర్తలు ప్రచారం చేయలేదు. పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం కూడా ఆశించిన స్థాయిలో చేయలేదు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గానీ పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు కానీ ఆంధ్ర ప్రాంత నాయకులు కానీ ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోయారు. 2016 ఎన్నికల్లో కూడా పార్టీ ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేక పోయింది. ఇప్పుడు కూడా ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోవడంతో అనూహ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు అనే విషయం స్పష్టంగా అర్థమైంది.

పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ మాత్రం వారిని సమర్థవంతంగా వినియోగించుకోలేదు అనే భావన చాలా మందిలో ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడైనా సరే పార్టీ భవిష్యత్తు మీద దృష్టి సాధిస్తుందా లేదా అనేది చూడాలి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తెలంగాణలో తీసుకోకపోతే కొంతమంది నేతలను పదవుల నుంచి తప్పించపోతే ఆ పార్టీ ఇంకా దారుణంగా దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయి అనే భావన చాలా వరకు కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: