హైదరాబాద్ : గ్రేటర్ పీఠం ఎవరిదన్న ఉత్కంఠకు నేటితో తెర పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఓటింగ్‌పై అన్ని పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి విజయం సాధించినట్లు ఫలితం వెలువడింది. బోరబండ నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మరోసారి విజయ ఢంకా మోగించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఆయన మెజార్టీ కూడా ఈసారి భారీగా పెరిగింది.

ఈ సారి ఫలితం చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే మెజార్టీ ఎంత? అనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. దీనిపై ఎలక్షన్ ఆఫీసర్లు ఎటువంటి ప్రకటనా చేయలేదు. గత ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఫసీయుద్దీన్.. ఫలితాల్లో ఘన విజయం సాధించి డిప్యూటీ మేయర్‌ పదవి పొందారు.

ఇప్పటి వరకూ వెల్లడైన గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మెట్టగూడ, బోరబండ, యూసుఫ్ గూడ స్థానాల్లో విజయం అధికార పార్టీనే విజయం వరించింది. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ 43 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 26 స్థానాల్లో గెలుపొందింది. ఎంఐఎం పార్టీ అనూహ్యంగా 39 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. తెలుగు దేశం పార్టీగానీ, స్వతంత్ర అభ్యర్థులు కానీ ఒక్క విజయాన్నీ నమోదు చేయలేకపోయారు. అయితే కొన్ని స్థానాల్లో మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది.

దుబ్బాక పరాజయం తర్వాత గ్రేటర్ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాయి. ఈ రెండు పార్టీలూ ఒకదాన్ని మించి మరొకటి ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు తదితరులు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రలు స్మృతి ఇరానీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు ప్రచారం నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: