గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఓటమి పాలు కావడానికి ఎవరు కారణం ఏంటి అనేది తెలియకపోయినా ఆ పార్టీ అధిష్టానం మాత్రం కచ్చితంగా కారణం అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చాలామంది ఆశించిన స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రచారం చేయలేకపోయారు. బీజేపీ అధిష్టానం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యటనలు చేసినా సరే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరూ కూడా హైదరాబాద్ వచ్చి ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడం చాలా వరకు విమర్శలకు దారి తీస్తోంది.

అగ్రనేతలందరు కూడా బిజెపి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృతంగా పర్యటించి టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఎవరూ కూడా కనీసం హైదరాబాద్ వైపు కూడా చూడకుండా రాష్ట్ర పార్టీ నాయకులకు మాత్రమే బాధ్యతలు అప్పగించి సైడ్ అయిపోయారు. దీనివలన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఘోరంగా విఫలమైంది అనే భావన చాలా వరకు వ్యక్తమవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ విషయంలో లైట్ తీసుకుందని అందుకే ఇప్పుడు తెలంగాణలో పార్టీఐ పట్టించుకోవడం లేదని అంటున్నారు.

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది అనే విషయం భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు హైదరాబాద్ వచ్చిన సందర్భంగానే స్పష్టంగా అర్థం అయింది. కాబట్టి ఆ పార్టీ ఇక తెలంగాణాలో మీద దృష్టి సారించే అవకాశం ఉండదు. హైదరాబాద్ ఎన్నికల్లో కూడా పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కనీసం ప్రతిపక్షంలో కూడా పార్టీ నిలవకపోవడం తో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది ఆసక్తికరంగా ఉంది. దీనితో కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కనీసం రాష్ట్ర స్థాయి నేతలకు కూడా ఫోన్ చేయలేదు అని సమాచారం. మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: