గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ పార్టీ నిలిచి గెలిచింది. మరో అయిదేళ్ళకు అధికారం సంపాదించేసింది. మేయర్ పీఠం చేపట్టాలంటే 76 మంది కార్పోరేటర్ల మద్దతు కావాలి. టీయారెస్ కి  అరవైదాకా సీట్లు దక్కనున్నాయి. దాంతో మరో 16 మంది మద్దతు కావాలి.  ఇక  ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు ఎటూ టీయారెస్ కి ఉంది. మొత్తం 42 మంది ఎక్స్ అఫీషియో  సభ్యులు గ్రేటర్ లో ఉంటే అందులో టీయారెస్ వాటా 31 మంది. దాంతో సులువుగా మేయర్ పీఠం టీయారెస్ పరం అవుతుంది.

ఇంకా గట్టిగా చెప్పాలంటే మజ్లీస్ పార్టీకి 42 మంది సభ్యులు ఎటూ ఉన్నారు. దాంతో మేయర్ సీటు టీయారెస్ దే అని ఢంకాభజాయించి మరీ  చెప్పవచ్చు. అయితే కారు దూకుడుకు మాత్రం బీజేపీ బాగానే బ్రేకులు వేసిందని చెప్పాలి. వంద సీట్లు కొడతామని బరిలోకి దిగిన టీయారెస్ కి వంద అన్నది కలగా మిగిల్చేసింది.

అందులో  సగానికి పైగా సీట్లు మాత్రమే టీయారెస్ సాధించగలిగింది అంటే అది కచ్చితంగా కాషాయం విజయంగానే భావించాలి అదే విధంగా చూసుకుంటే టీయారెస్ కి ఈసారి ఫలితాలు మాత్రం ఖంగు తినిపించాయనే అనుకోవాలి. మాకు వందా, మిత్రపక్షం మజ్లీస్  కి మరో 40 సీట్లు అంతే మొత్తానికి మొత్తం కార్పోరేషన్ లో వేరే వారికి చోటు లేదు అన్నట్లుగా గత సారి హవా చాటింది.

ఈసారి మాత్రం టీయారెస్ కారు  దూకుడుని సక్సెస్ ఫుల్ గా బీజేపీ అడ్డుకుంది. దాంతో వంద సీట్లు సాధించాల్సిన టీయారెస్ చతికిలపడింది. దానికి తోడు కార్పోరేషన్ లో అర్ధ సెంచరీ కొట్టి బీజేపీ బలమైన పార్టీగా ఉండడం అంటే అది కంటి మీద కునుకు లేకుండా చేసినట్లే. మొత్తానికి ఈసారి గ్రేటర్ ఓటర్లు మాత్రం చాలా వినూత్నమైన విలక్షణమైన తీర్పునే ఇచ్చాయి అనుకోవాలి.ఇక చూడాలి ఏం జరగనుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: