హైదరాబాద్ : గ్రేటర్ పీఠం ఎవరిదన్న ఉత్కంఠకు నేటితో తెర పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఓటింగ్‌పై అన్ని పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. అయితే ముషీరాబాద్‌లోని అడికమెట్ నియోజక వర్గంలో మాత్రం కమలం పార్టీ విజయ ఢంకా మోగించింది. మొత్తం గ్రేటర్ ఎన్నికల్లో 46.60 శాతం పోలింగ్ నమోదు కాగా, అడికమెట్ లో మాత్రం 44.02 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. ఇక్కడ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బీ హేమలత ఘన విజయం సాధించింది.

ఈసారి మాత్రం ఇక్కడ ఫలితం తారుమారు అయింది. అడికమెట్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి సీ సునీతా ప్రకాష్ గౌండ్ ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. బీజేపీ తరఫున సునీతా ప్రకాష్ గౌడ్, టీఆర్ఎస్ తరఫున బీ హేమలత, కాంగ్రెస్ నుంచి కవితా జంబిక, టీడీపీ నుంచి ఎం చిత్ర బరిలో నిలిచారు. వీరిలో బీజేపీ అభ్యర్థి సునీతకు టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. తెలుగు దేశం అభ్యర్థి ఎం చిత్ర ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. అడికమెట్ లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం విశేషం. కాసారమ్ స్రవంతి, పీ అనూష, బిట్ల సౌజన్య, ఎలిగేటి శ్యామల స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసి గ్రేటర్ బరిలో నిలబడ్డారు. వీరు కూడా ఇక్కడ చాలా గట్టి పోటీ ఇచ్చారనే చెప్పాలి. అయితే చివరకు విజయం మాత్రం బీజేపీ అభ్యర్థి సునీతనే వరించింది.


దుబ్బాక పరాజయం తర్వాత గ్రేటర్ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాయి. ఈ రెండు పార్టీలూ ఒకదాన్ని మించి మరొకటి ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు తదితరులు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రలు స్మృతి ఇరానీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు ప్రచారం నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: