గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్ళిపోఏ అవకాశాలు  ఉండవచ్చు అనే భావన చాలా మందిలో ఉంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధించిన విజయం తర్వాత చాలామంది నేతలు పార్టీ మారిపోయే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆయనతో ఇప్పటికే బీజేపీ నేతలు చర్చలు జరిపారని సమాచారం.

ఆయనతోపాటు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనతో పాటుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా ఘోరపరాభవం ఎదుర్కోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సమర్థవంతంగా హైదరాబాద్ పరిధిలో ప్రచారం చేయలేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

త్వరలోనే వీరిలో కొంతమంది నేతలు పార్టీ మారే వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన ఎప్పుడు మారుతారు అనే దానిపై వచ్చే వారం రోజుల్లో స్పష్టత రానుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు సహకారం లేకపోవడం తో పార్టీ మారటానికి ఆయన రెడీ అయ్యారని అంటున్నారు. ఇక ఆయనతో పాటుగా ఎంత మంది నేతలు పార్టీ మారవచ్చు అనే దానిపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: