తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకు  వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిపక్షంగా సమర్ధవంతం గా నిలిచింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పార్టీ చాలా వరకు కూడా టిఆర్ఎస్ పార్టీని కొన్ని ప్రాంతాల్లో కట్టడి చేసింది అనే అభిప్రాయం చాలా వరకు ఉంది. రాజకీయంగా ఇప్పుడు ఆ పార్టీ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు దిశగా కూడా అడుగులు వేస్తుంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే విధంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు ఆ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించడంతో ఇక రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ దృష్టిసారించి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మీద కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఆయన ఎప్పుడు పర్యటనలు చేస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా దాదాపుగా ఆయన వచ్చే నెలలో పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన ఖమ్మం జిల్లా రంగారెడ్డి అదేవిధంగా ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో పర్యటనలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత వరకు ఆ పార్టీ విజయం సాధిస్తుంది టిఆర్ఎస్ పార్టీ ని ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: