తెలంగాణ లో బీజేపీ పార్టీ అధికార టీ ఆర్ ఎస్ పార్టీ కి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.. ఎందుకంటే దుబ్బాక లో గెలిచినంత మాత్రాన ఇక్కడ గెలుస్తుందని చెప్పలేమని బీజేపీ ని హేళన చేశారు టీ ఆర్ ఎస్ నేతలు. అయితే రెట్టించిన ఉత్సాహంతో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ పార్టీ నేతలు.  అయితే బీజేపీ దూకుడు అధికార పార్టీ కి కొంత నష్టం చేకూర్చిన కాంగ్రెస్ కి మాత్రం పెద్ద దెబ్బ ఎదురైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే టీ ఆర్ ఎస్ స్థానాలు టీ ఆర్ ఎస్ ఉంచుకోగా కాంగ్రెస్ స్థానాలను అన్నిన్నిటిని బీజేపీ లాగేసుకుంది చెప్పొచ్చు..

నిజానికి కాంగ్రెస్ ఇంతలా అన్ని ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఆ పార్టీ త‌ర‌పున ఏ ఒక్క నేతా బాధ్య‌తాయుతంగా ప్ర‌చారం చేసింది లేదు.. పోనీ ఆ పార్టీ లో నేతలైన సక్రమంగా ఉంటారా అంటే ఎక్కడ ఎవరు ఎదిగిపోతారో తమను తొక్కేస్తారో అన్న అభద్రతా భావం వారిలో నెలకొంది.దాంతో పార్టీ పై పట్టు తో పాటు నమ్మకాన్ని కూడా వదిలేసుకున్నారు కాంగ్రెస్ నేతలు.. ఏ ఒక్కనాయకుడు కూడా పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింప‌డానికి ప్ర‌య‌త్నించింది లేదు. ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గానే.. పార్టీ త‌ర‌ఫున గ‌తంలో మేయ‌ర్ పీఠాన్ని అనుభ‌వించిన కార్తికా రెడ్డి లాంటి వాళ్లు కూడా క‌మ‌లం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

సోనియాకు తాము కుక్క‌ల్లాంటి వాళ్లం అని గ‌తంలో చెప్పుకున్న వాళ్లు కూడా బీజేపీ పంచ‌న చేరారు. ఈ ప‌రిణామాల‌న్నీ కొద్దోగొప్పో ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆలోచ‌న‌లో ప‌డేశాయి. దాంతో వారి కి ఉన్న ఓట్లన్నీ బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది. బీజేపీ జోరు చూస్తుంటే కాంగ్రెస్ ని తొక్కేసి రెండో స్థానంలో తానే ఉండబోతున్నట్లు కనిపిస్తుంది. టీ ఆర్ ఎస్ పై ఉన్న వ్యతిరేకత ను కాంగ్రెస్ ఉపయోగించుకోవడంలో విఫలమయ్యింది.. ఆ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కి పడకుండా బీజేపీ కి పడడంతో బీజేపీ అనూహ్యంగా బలపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: