గ్రేటర్ ఎన్నికలు అనుకున్నంత సులువుగా అయితే జరగలేదు.. టీ ఆర్ ఎస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందనుకున్నా బీజేపీ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పొచ్చు.. అయితే ప్రచారంలో ఎందుకు బీజేపీ పార్టీ అంతలా హైలైట్ చేసిందో తెలీదు కానీ తాము అనుకున్నట్లే తెలంగాణ లో బలమైన పార్టీ గా ఎదిగింది.. దుబ్బాక లో విజయం వారిలో పూర్తి ఆత్మవిశ్వాసం నింపగా ఇక్కడ గట్టి పోటీ ఇవ్వడానికి ఆ ఉత్సాహం పూర్తిగా పనికొచ్చింది..

గ్రేటర్ మేయర్ పీఠం టీ ఆర్ ఎస్ కి వెళ్లినా బీజేపీ కి వందకు వంద మార్కులు వేశారు ప్రజలు..ఆ పార్టీ దాదాపు నలభై సీట్లు గెల్చుకోవడం ఖాయం గా కనిపిస్తుంది.. తెలంగాణ లో ఇది పెద్ద విప్లవం అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ని పక్కన పెట్టి బీజేపీ కి ప్రజలు ఓట్లు వేసి బీజేపీ పై నమ్మకం ఉంచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎవరిని ప్రజలు పట్టించుకోలేదు. ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ లో ప్రత్యామ్నాయ పార్టీ ఇదేనని క్లియర్ గా తెలిసిపోయింది. వరదలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెంచాయి.

సరిగ్గా ఎన్నికల సమయంలో టీ ఆర్ ఎస్ కి ఇది వ్యతిరేకంగా మారిపోగా బీజేపీ కి అది వారమైపోయింది.. గతం లో కూడా టీ ఆర్ ఎస్ పై వ్యతిరేకత వీరికి పనికొచ్చింది.. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకపక్షంగా బీజేపీకి పడింది. ఇక బీజేపీ బలపడడంలో బండి సంజయ్ ప్రముఖ పాత్ర వహించాడని చెప్పొచ్చు. తనదైన మార్క్ ప్రకటనతో బీజేపీని ప్రధాన పోటీదారుగా మార్చడంలో సక్సెస్ అయ్యారు. టీ ఆర్ ఎస్ ని విమర్శించడంలో బండి సంజయ్ ఆరితేరిపోయాడు..రాష్ట్రంలో జరిగే ప్రతీ వివాదాన్ని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేశారు. ప్రజల నమ్మకాన్ని సాధించడంలో బండి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక గ్రేటర్ ఎన్నిలపై బీజేపీ హైకమాండ్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. అందుకే ఇప్పుడు మంచి ఫలితాలు పొందారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: