హైదరబాద్ ,ఉప్పల్ :  తెలంగాణలో ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ క్రమీసి బలహీన పడుతూ వచ్చింది.అయితే కాంగ్రెస్ తెలంగాణలో ఉనికిని కాపాడుకోవలసిన అవసరం ఏర్పడింది.కాంగ్రెస్ కు ఇంత గడ్డుకాలంలో జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికలు కీలకంగా మారాయి.అయితే ఈ జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికలు కూడా కాంగ్రెస్ కు మొండి చేయి చూపించాయి.

ఈ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లలోనే విజయం సాధించడంతో తీవ్ర అసహనంతో ఉంది కాంగ్రెస్ అధిష్టానం.అయితే ఆ రెండు సీట్లు కూడా కైవసం చేసుకున్నవారు ఇద్దరు మహిళా అభ్యర్థులే కావడం విశేషం. ఏఎస్‌ రావు నగర్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్‌ (10వ డివిజన్) నుంచి మందముల్లా రజిత 5912 ఓట్లతో గెలుపొందారు.

కాగా గ్రేటర్‌ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీని హైదరాబాద్‌ ఓటర్లు మరోసారి తిరస్కరించారనే చెప్పవచ్చు. వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ కౌంటింగ్ ప్రారంభ దశ నుండి కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.దీంతో కాంగ్రెస్ అధిష్టానం లో పార్టీ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని సందేహాలు వ్యక్తమవుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: