హైదరాబాద్ : గ్రేటర్ పీఠం ఎవరిదన్న ఉత్కంఠకు నేటితో తెర పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ‌పై అన్ని పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఈ క్రమంలో నగరంలోని కూకట్ పల్లి నియోజక వర్గం మొత్తం గులాబీ మయంగా నిలిచింది. ఇక్కడ మొత్తం ఆరు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. కూకట్ పల్లిలో ఓల్డ్ బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి, వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ.. మొత్తం గులాబీ నేతలే విజయ ఢంకా మోగించారు.


119వ నెంబర్ డివిజన్ ఓల్డ్ బోయిన్ పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నర్సింహీ యాదవ్ విజయం సాధించారు. 120 నెంబర్ డివిజన్ బాలా నగరల్ లో ఆవుల రవీందర్ రెడ్డి 3,748 ఓట్ల మెజార్టీతో భారీ విజయం నమోదు చేశారు. 121వ నెంబరు డివిజన్ కూకట్ పల్లిలో జూపల్లి సత్యనారాయణ 749 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. 122వ నెంబర్ డివిజన్ వివేకానంద నగర్ లో మాధవరం రోజా రంగారావు గెలుపొందగా.. 123వ నెంబర్ డివిజన్ హైదర్ నగర్‌లో నార్నె శ్రీనివాస్ రావు 2010 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక చివరిదైన 124వ నెంబర్ డివిజన్ ఆల్విన్ కాలనీలో దొడ్ల వెంకటేష్ గౌండ్ 1208 ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు.

దుబ్బాక పరాజయం తర్వాత గ్రేటర్ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాయి. ఈ రెండు పార్టీలూ ఒకదాన్ని మించి మరొకటి ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు తదితరులు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రలు స్మృతి ఇరానీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు ప్రచారం నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: