కాంగ్రెస్ పార్టీ నుండి మీడియా ముంచింది
రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కేవలం రెండు స్థానాల్లో నే గెలుపొందింది. మొదటి స్థానం టీఆర్ఎస్, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో ఎంఐఎం నిలువుగా నాల్గవ స్థానంలో కాంగ్రెస్ కు దక్కింది. పార్టీలో అంతర్గత కుమ్ము వాటాలు కారణంగా పేర్కొనవచ్చు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మీడియాపై విమర్శలు గుప్పించాడు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడానికి మీడియానే కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీడియపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఎన్నికల్లో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించలేదని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఓటర్లు కారణం కానే కాదని, మీడియానే కారణమంటూ ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీ లు ప్యాకేజీలతో మీడియాను నియంత్రించాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కి సొంత మీడియా లేకపోవడం లోటు గా పేర్కొన్నారు. 
కష్టకాలంలో జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: