ఏక కాలంలో రెండు రంగాల్లో ఉనికిని బలంగా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ గా అటు షూటింగుల హడావుడి, జనసేనానిగా ఇటు రాజకీయాల్లో సందడి వెరసి ఆయన యమా బిజీ గా ఉరుకులు పరుగుల మధ్య ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలిస్తూ తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న కృష్ణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్ ఇవాళ, రేపు నెల్లూరులో ప్లాన్ చేసుకున్నారు. ఇవాళ నాయుడు పేట, గూడూరు, మనుబోలు రేపు రావూరు, వేంకటగిరి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పవన్ రాక సందర్భంగా జనసేన కార్యకర్తలు పార్టీఅతన ఏర్పాటులో తలమునకలయ్యారు. 


కౌలు రైతుల కోసం జై కిసాన్
కౌలు రైతులని ఆదుకుండేందుకు జనసేన పార్టీ జై కిసాన్ కార్యక్రమాన్ని రూపొందించనుంది పవన్ కళ్యాణ్ తెలిపారు. తుపాన్ ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న జనసేనాని అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తుపాన్ తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్నదాతలు నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై జై కిసాన్ ప్రత్యేక కార్యాచరణ అమలు పరిచేందుకు ఓ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అధికార వైసీపీ తీరును ఎండగడుతూ ఆ పార్టీ అధికారాన్ని అజమాయిషీ, అలంకరణ కోసం మాత్రమే చూస్తున్నారని ప్రజా సేవ పట్ల తగినంత శ్రద్ద లేదని విమర్శించారు. అసెంబ్లీలో అన్నదాతల సమస్యలను చర్చించడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే కేటాయించారన్నారు. 17లక్షల ఎకరాల వారి, ఇతరపంటలు ఘోరంగా దెబ్బ తిన్నాయన్నారు. పంట నష్టాన్ని తట్టుకోలేక నలుగురు రైతులు ఆత్మా హత్య చేసుకున్నారని ఆవేదన చెందారు. 


పరిహారం కింద అయిదు వేలో, పది వేలో చెల్లించి చేతులు దులుపుకుంటే తగదన్నారు. మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది, ఇసుక రేవులను వారి సంబంధీకులే నిర్వహిస్తున్నారు...కానీ రైతులని ఆదుకోవడంలో మాత్రం శ్రద్ద కనబరచడం లేదని దుయ్యపట్టారు. చిరంజీవి లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగితే బలమైన సీఎం ని చూసేవాళ్లమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: