ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి.. అనే సామెత ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలకు సరిగ్గా సరిపోతుంది.. గెలుస్తామని ధీమాతో ఉన్న నేతలకు ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ను ఇచ్చాయి. అనుకున్నది ఒకటి అయినది మరొకటి మాదిరిగా ఎన్నికలు భారీ షాక్ లను అందించాయి.. మొదటి నుంచి పోటీలో ఉన్న టీఆర్ఎస్, బీజేపి పార్టీలు సత్తాను చూపాయి. మొదటి లెక్కింపు నుంచి రెండు పార్టీలు పోటీతో దూసుకెళ్లాయి..



అయితే, చివరికి మాత్రం గులాబీ జెండా భారీ మెజారిటీ తో ముందుకు వస్తున్నారు.. రెండో స్థానంలో బీజేపి కొనసాగుతుంది.. కాంగ్రెస్ అతి తక్కువ స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ మాత్రం పెద్దగా ఖాతాను తెరిచినట్లు కనిపించలేదు.. కొన్ని ప్రాంతాల్లో కారు జోరు కొనసాగుతుంది. వరద బాధిత ప్రాంతాల్లో మాత్రం బీజేపి అగ్రస్థానంలో ఉంది.. మిగిలిన పార్టీలు అతి తక్కువ స్థానాల్లో విజయాన్ని అందుకున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది.. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.



పార్టీ ఓటమికి తానే కారణమని ఆయన అన్నారు..  గ్రేటర్ ఎన్నికల్లో దారుణంగా ఓటమిని ఎదుర్కొనడానికి కారణం తానేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీకి ఓటర్లు పెద్ద షాకిచ్చారు. దీంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్‌లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణమంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. మీడియా తెరాస పార్టీకే మొగ్గు చూపిందంటూ ఆరోపించారు. ఈ విషయం ప్రస్తుతం రాజకీయ చర్చలకు దారి తీసింది..ఆయన పార్టీకి రాజీనామా చేస్తే తర్వాత చీఫ్ ఎవరు ఉంటారు అనే విషయం ఆసక్తిగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: