గ్రేటర్ ఎన్నికల హడావుడి పూర్తయింది. దాదాపుగా టీఆర్ఎస్ తరువాత బిజెపి అందరి కంటే ఎక్కువ స్థానాలు తెచ్చుకుంది. ఇక టీఆర్ఎస్ అందరి కంటే ఎక్కువ స్థానాలు తెచ్చుకున్నా  ఎంఐఎం సపోర్ట్ లేకుండా మేయర్ స్థానం దక్కించుకోవడం అయితే కష్టమనే చెప్పాలి. ఇక ఎప్పుడూ లేనిది బిజెపి భారీగా బలం పుంజుకుని దాదాపు 47 స్థానాలు ఎగబాకి టిఆర్ఎస్ కు చేరువయ్యింది. ఎప్పటిలాగే మజ్లిస్ పార్టీ కూడా తనకు పట్టున్న ప్రాంతాల్లో సీట్లు గెలిచిన 42 స్థానాలు తెచ్చుకుంది. అయితే గత ఎన్నికల్లో మంచి నెంబరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఘోర ఓటమి పాలైంది. అలాగే టీడీపీ కూడా చెప్పుకోలేని విధంగా 106 స్థానాల్లో పోటీ చేసి పోటీ చేసిన అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. 

నిజానికి ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అన్న ఆశ నమ్మకం ఎవరికీ లేద., అందుకే ప్రచారానికి కూడా కనీసం ఒక్క అగ్రనేత కూడా పాల్గొనలేదు. కేవలం తెలంగాణ టిడిపిలో యాక్టివ్ గా ఉన్న కొందరు నాయకులు మాత్రమే ప్రచారానికి పరిమితమయ్యారు. అంతేకాక కొన్ని ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్ అంతా కూడా టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పని చేసిందన్న అపవాదు కూడా ఆ పార్టీ మీద ఉంది. ఈ క్రమంలో 106 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ ఆ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయి పరువు తీసుకుందని చెప్పొచ్చు. 

నిజానికి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో తెలంగాణకి తామే ప్రత్యామ్నాయం అన్నట్టు టిడిపి గట్టిగా ప్రచారం చేసుకుంది. అప్పుడు కాంగ్రెస్ తో కలిసి టీఆర్ఎస్ ని ఎలా అయినా ఓడించాలని చంద్రబాబు సహా లోకేష్ బాలకృష్ణ అలాగే ఏపీకి చెందిన అప్పటి మంత్రులు చాలా మంది తెలంగాణలో ప్రచారం చేశారు. కానీ నీ టిఆర్ఎస్ వేవ్ కి తట్టుకోలేక పోయి ఘోర ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఒక రకంగా చంద్రబాబు తెలంగాణ టిడిపికి దూరంగా ఉంటున్నారని చెప్పొచ్చు. కేవలం ఎల్.రమణకు బాధ్యతలు అప్పగించి అప్పుడప్పుడు పరిస్థితులు గమనించడం తప్ప ఆయన సరిగా పార్టీని పట్టించుకోవడం లేదని పార్టీ క్యాడర్ లోనే బలమైన నా అభిప్రాయం నాటుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: