గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అలాగే బిజెపి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయన్న సంగతి తెలిసిందే. గతంలో 99 స్థానాలు గెలుచుకున్న అధికార టీఆర్ఎస్ ఈ సారి మేయర్ పీఠం గెలుచుకునేందుకు కూడా సరిపడా స్థానాలను గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం 148 స్థానాలకి కౌంటింగ్ పూర్తిగా అందరూ 56 స్థానాలకు మాత్రమే టిఆర్ఎస్ కైవసం చేసుకుంద. కానీ పాతబస్తీలో మజ్లీస్‌ పార్టీ హవా తిరిగి కొనసాగింది.

అయితే చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లోని 24 డివిజన్లలో 22 డివిజన్లు తన ఖాతాలో వేసుకొని పాతబస్తీలో తనకు తిరుగు లేదని మరోసారి రుజువు చేసింది. పాతబస్తీ డివిజన్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. గతంలోని సిట్టింగ్‌ సీట్లన్నింటిని తిరిగి కైవసం చేసుకుంది.బహదూర్‌పురా నియోజకవర్గంలోని ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్‌కుంట, జహనుమా, కిషన్‌బాగ్, రామ్నాస్‌పురా, దూద్‌బౌలి తదితర డివిజన్లన్నీ మజ్లీస్‌ ఖాతాలోకి చేరాయి.

ఇక చార్మినార్‌ నియోజకవర్గంలోని మొత్తం ఐదు డివిజన్లలో మొఘల్‌ఫురా, పత్తర్‌గట్టి, శాలిబండ, పురానాపూల్, ఘాన్సీబజార్‌లలో మజ్లీస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.  చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో చాంద్రాయణగుట్ట, బార్కాస్, రియాసత్‌నగర్, కంచన్‌బాగ్, ఉప్పుగూడ, జంగమ్మెట్, లలితాబాగ్‌ డివిజన్లను మజ్లీస్‌ పార్టీ కైవసం చేసుకుంది.

గతంలో ఈ డివిజన్లన్నీ మజ్లీస్‌వే. 2009,2016 ఎన్నికల్లో సా«ధించిన డివిజన్లన్నీంటిని మజ్లీస్‌ పార్టీ ఈసారి కూడా తిరిగి కైవసం చేసుకుంది. యాకుత్‌పురా నియోజకవర్గంలో... తలాబ్‌చంచలం, సంతోష్‌నగర్, రెయిన్‌బజార్, కుర్మగూడ,ఐఎస్‌ సదన్,గౌలిపురా తదితర ఆరు డివిజన్లలో నాలుగింటిని మజ్లీస్‌ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మిలిగిన గౌలిపురాతో పాటు ఐ.ఎస్‌.సదన్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. పాతబస్తీలోని రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా.. టీఆర్‌ఎస్, కాంగ్రేస్, టీడీపీ తమ ఉనికిని కాపాడుకోలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: