గ్రేటర్ ఎన్నికల్లో కొందరు మంత్రులతో పాటు కీలక టీఆర్ఎస్ నేతలు ఘోరంగా విఫలమయ్యారు. సొంత నియోజకవర్గంలో కొందరు అభ్యర్థుల్ని గెలిపించుకోలేక చతికిల పడితే... మరికొందరు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్నచోట కూడా అభ్యర్థులు బొక్క బోర్లా పడ్డారు. పార్టీ తరఫున బరిలోకి దిగిన కొందరు నేతల రక్త సంబంధీకులకూ షాక్‌ తప్పలేదు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వని గ్రేటర్‌ ఓటర్ అధికార పార్టీకి మాత్రం భారీ షాక్‌ ఇచ్చాడనే చెప్పాలి. 100 పైన ఎన్ని వస్తాయో లెక్క వేసుకోవడమే తరువాయి అంటూ కేటీఆర్ లాంటి నేతలు ప్రచారంలో చెబితే ఇక్కడ మాత్రం దానిని హాఫ్‌ సెంచరీకే పరిమితం కావాల్సి వచ్చింది. 


ఆ విషయం ఎలా ఉన్నా సరే, బీ ఎన్ రెడ్డి డివిజన్ లో  వింత ఘటన జరిగింది. అదేంటంటే ఈ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో విజయం సాధించాడు. అదే డివిజన్ లో ఇండిపెండెంట్ డమ్మీ అభ్యర్థిగా టీఆరెస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్న కుమారుడు ముదగౌని రంజిత్ గౌడ్ పోటీ చేశారు. రంజిత్ గౌడ్ కు  39 ఓట్లు పోల్ అయి తల్లి ఓట్లు చీల్చాడు. అవే వోట్లు చీల్చకుండా ఉండి ఉంటె టీఆర్ఎస్ అభ్యర్ది గెలిచి ఉండేది. ఆ విధంగా ముందు జాగ్రత్త కోసం వేయించిన డమ్మీ నామినేషన్ కొంప ముంచింది.


 నిజానికి అసలు అభ్యర్ధికి డమ్మీగా వారి కుటుంబానికి చెందిన ఎవరో ఒకరు నామినేషన్ వేయడం ఆనవాయితీ గా వస్తోంది. ఒక వేళ ఏదయినా కారణాల వలన అసలు అభ్యర్ధి నామినేషన్ తిరస్కరించినా డమ్మీ అభ్యర్ధి రేసులో ఉన్నట్టు అవుతుంది. ఆ ముందు జాగ్రత్త కోసం వేయించిన డమ్మీ నామినేషన్ కొంప ముంచింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: