గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి... వెలువడిన ఫలితాలతో రాజకీయ పార్టీలన్నీ కూడా కంగు తిన్నాయనే చెప్పాలి.ఏ పార్టీ ఊహించని రీతిలో గ్రేటర్ ఓటర్లు తీర్పు ఇచ్చారు.వచ్చిన ఫలితాలతో ఈ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ను తాకలేదు.దాంతో ఈసారి 'హంగ్' పరిస్థితులే పుస్కాలంగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం 150 సీట్లలో టీఆర్ఎస్ 54,బీజేపీ 47,ఎంఐఎం 42,కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే  మేయర్ పీఠాన్ని స్వతంత్రంగా దక్కించుకోవాలంటే  కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 102 స్థానాలు రావాలి.

ఈ మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి కూడా రాకపోవడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.మేయర్ పీఠాన్ని అధిస్టించడానికి టి‌ఆర్‌ఎస్ దగ్గరగా ఉన్నప్పటికి ఇతర పార్టీ బలం కావాల్సిందే.ప్రస్తుతం టి‌ఆర్‌ఎస్ సంపాదించుకున్నవి 54, టీఆర్ఎస్‌ దగ్గర ఉన్న ఎక్స్‌అఫీషియో ఓట్లు 38  ఉన్నప్పటికీ పార్టీ బలం 92 మాత్రమే అవుతుంది. అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు కచ్చితంగా కావాల్సిందే. 

ఈ నేపథ్యంలో మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందా..అన్నది ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం సొంతంగా 42 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీకి 10 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంను మద్దతు కోరే అవకాశం ఉంది. అయితే ఎంఐఎం ఎలాంటి డిమాండ్లు కోరుతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఒకవేళ బి‌జే‌పి,ఎంఐఎం కలిసిన మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం కష్టం కాబట్టి కచ్చితంగా టి‌ఆర్‌ఎస్ తోనే పొత్తు పెట్టుకోక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: