గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. ఈ విజయం తెచ్చిన ఊపుని  ఇక్కడితో ఆపకుండా కొనసాగించాలని కమలనాధులు గట్టి నిర్ణయమే తీసుకున్నారు. నిజానికి దుబ్బాక ఉన ఎన్నికతో బీజేపీ లో దూకుడు పెరిగింది. గ్రేటర్ తో అది జెట్ స్పీడ్ కి చేరుకుంది. ఇపుడు వాయువేగంతో బీజేపీ ఏపీ వైపుగా దూసుకువస్తోంది అంటున్నారు.

కొత్త సంవత్సరం అంతా ఏపీతోనే బీజేపీకి పెద్ద పని ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి. అదే విధంగా ఒక వేళ పెడితే లోకల్ బాడీ ఎన్నికలూ ఉన్నాయి. దాంతో బీజేపీకి ఫుల్ పనే పని అన్నట్లుగా ఉంటుంది. ఇక ఏపీలో జగన్ పాలనకు అప్పటికి మెల్లగా రెండేళ్ళు పూర్తి అవుతాయి.

కాబట్టి ఏమైనా ప్రజా వ్యతిరేకత కనుక వస్తే గిస్తే దానిని టీడీపీ కంటే ముందు తమ వైపుగా మళ్ళించుకుని లబ్ది పొందేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను రెడీ చేసుకుంటుంది అనడంలో ఎటువతి సందేహమూ లేదు. ఇదిలా ఉంటే బీజేపీకి గ్రేటర్ ఎన్నికలు ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు ఇక తెలంగాణాలో పాగా వేస్తామన్న ధీమాతో కమలనాధులు భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.

అదే సమయంలో ఏపీలో కూడా పాగా వేస్తామని అంటున్నారు. మరి దానికి నాంది తిరుపతి ఉప ఎన్నికలు అనుకోవాలి. ఇక్కడ చూస్తే బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. కానీ మారిన రాజకీయం, సాటి తెలుగు రాష్ట్రంలో పెరిగిన కమలం బలం, దేశవ్యాప్తంగా  మోడీ ఇమేజ్, క్రేజ్ ఇవన్నీ కలసి ఏపీలో బీజేపీకి మంచి హోప్ ని ఇస్తున్నాయి. మరి చూడాలి బీజేపీ దూకుడుతో తిరుపతి కి ఫుల్ హీట్ రావడం ఖాయమని అంటున్నారు. బీజేపీకి జనసేన మిత్రపక్షంగా కూడా ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏమైనా మ్యాజిక్ చేస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: