ప్రధాని మోడీకి ఇప్పటికి రెండు సార్లు ప్రధానిగా అయ్యారు. మొదటిసారి ఫుల్ మెజారిటీ వచ్చినా అది బోటాబొటీగానే మిగిలింది. రెండవసారి మాత్రం రెట్టించిన ఉత్సాహంతో మోడీ ఎన్నికలకు వెళ్తే ఏకంగా 303 సీట్లు దక్కాయి. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ చిద్రమైతే రెండవసారి బలమైన ప్రాంతీయ పార్టీలు మోడీ గాలికి కొట్టుకుపోయాయి. అయితే ఉత్తరాదిన ఎంతగా మోడీ గాలి వీచినా కూడా సౌత్ లో మాత్రం పెద్దగా ఓట్లూ సీట్లు రావడంలేదు.

ఇక 2019 ఎన్నికల్లో కర్నాటక‌ అండగా నిలబడితే తెలంగాణా తన వాటాగా నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చింది. ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి  పడ్డాయి. ఇక తమిళనాడు పలకలేదు, కేరళలో కూడా బోణీ కొట్టడం జరగలేదు. అయితే కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే సౌత్ లో సీన్ మొత్తం మారుతోంది అంటున్నారు. బీజేపీకి ఇపుడు నార్త్ కంటే సౌత్ చాలా ముఖ్యం. ఉత్తరాదిన కమల వికాసం పీక్స్ కి చేరింది. అక్కడ రావాల్సిన సీట్లు వచ్చెశాయి. రేపటి ఎన్నికల్లో మోడీ సర్కార్ మీద  యాంటీ ఎస్టాబ్లిష్ మెంట్  ఓటు  ఏమైనా ఉంటే ఉన్న సీట్లు కూడా తగ్గుతాయి. మరి మళ్లీ మోడీ మూడవసారి ప్రధాని కావాలన్నా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకోవాలన్నా సౌత్ వైపే చూడాల్సిన సీన్ ఉంది.

మొత్తం సౌత్ లోని అయిదు రాష్ట్రాలు కలుపుకుని 119 సీట్లు ఉన్నాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో 42 సీట్లు ఉంటే, తమిళనాడులో 39, కర్నాటకలో 28, కేరళలో 20 సీట్లు ఉన్నాయి. ఇపుడు వీటి మీదనే బీజేపీ ఆశలు పెట్టుకుని రాజకీయ ప్రయోగాలు చేస్తోంది. తెలంగాణాలో గత ఎన్నికల్లో మొత్తం 17కి గానూ నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి డజన్ సీట్లు అయినా ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది.


అదే విధంగా చూసుకుంటే ఏపీలో 25 సీట్లు ఉన్నాయి. ఇక్కడ బోణీ అసలు కొట్టలేదు. మరి రానున్న ఎన్నికల్లో పొత్తులు ఎత్తులు వేసైనా కనీసం డజన్ సీట్లను సాధించాలనుకుంటోంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో పాతిక దాకా సీటు తెచ్చుకుంటే కర్నాటకలో మరో పాతిక వస్తాయని లెక్కలు ఉన్నాయి. ఇక  కేరళలో ఒకటి రెండు సీట్లు అయినా వస్తాయని ఆశపడుతోంది.

తమిళనాటి రజనీకాంత్ రాజకీయం తరువాత బీజేపీ ఆశలు పెరిగాయని అంటున్నారు. అక్కడ కనీసం డజన్ సీట్లు అయినా తెచ్చుకుంటే మొత్తానికి ఒక అరవై సీట్లు సౌత్ నుంచి పట్టుకెళ్తే మళ్ళీ మూడవ సారి ప్రధానిగా మోడీ రావడం ఖాయమన్నది బీజేపీ లెక్కలుగా ఉన్నాయి. అంటే మొత్తానికి చూసుకుంటే వచ్చే  ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరాదిన తక్కువలో తక్కువ 200 సీట్లు వచ్చినా కాపు కాసేలా సౌత్  స్టేట్స్ ని ముందే రెడీ చేసి పెట్టుకుంటోంది అన్న మాట. చూడాలి మరి బీజేపీ రాజకీయానికి సౌత్ సుస్వాగతం చెబుతుందా లేదా అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: