గ్రేటర్ ఎన్నికల తుది ఫలితాలు విడుదల అయ్యాయి..  అధికార పార్టీ తెరాస కి 56 సీట్లు దక్కగా, బీజేపీ కి 49  సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు దక్కించుకోగా ఎంఐఎం పార్టీ కి 43 దక్కాయి. ఇక గ్రేటర్ లో పాల్గొన మరో పెద్ద పార్టీ కి కనీసం ఒక్క సీటు కూడా దక్కకపోవడం ఆశ్చర్యం..హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది టీడీపీ నే అనే చెప్పుకునే నేతలు బీజేపీ, తెరాస దూకుడు లో కొట్టుకుపోయారు.. కనీస పోటీ ని కూడా టీడీపీ ఇక్కడ ఇవ్వలేకపోయింది.. దీనికంటే పార్టీ పోటీ చేయకుండా ఉంటే బాగుండేదేమో..106 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయింది టీడీపీ..

నిన్నటి దాకా... మేమున్నామని గుర్తించండి అనే స్థాయిలో నిలబడిన ఆ పార్టీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. తెలంగాణలో తెలుగుదేశానికి భవిష్యత్తులేదని చెప్పడానికి గ్రేటర్ ఫలితాలు తాజా ఉదాహరణగా నిలిచాయి.గతంలో 2016 లో ఒక్క సీటుకి పరిమితమయిన టీడీపీ ఇప్పుడు ఆ సీటును కూడా నిలుపుకోలేకపోయింది. అయితే టీడీపీ సీట్లు గెలిపించుకోలేకపోయిన తమకు ఓట్ల బలం ఉందని మాత్రం రుజువు అయ్యింది. తెరాస గెలిచినా చాలా స్థానాల్లో టీడీపీ రెండో స్థానం లో ఉందంటే టీడీపీ కి ఇక్కడ ఓటు బ్యాంకు ఉందని చెప్పొచ్చు.

అయితే ఇక్కడ చంద్రబాబు, లోకేష్ , బాలకృష్ణ లు ప్రచారం చేయకపోవడమే పెద్ద మైనస్ గా చెప్పుకొచ్చారు. వారు చేసుంటే కనీసం ఒకటో రెండో సీట్లు అయినా వచుండేవి అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల అగ్రనేతలు స్వయంగా ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ప్రత్యర్థుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ సుడిగాలి పర్యటనలు చేశారు. కానీ... వందకు పైగా స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ తరుపున మాత్రం ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రచారం చేయలేక పోయింది. ఓటమిని ముందే ఊహించి చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రచారంలో పాల్గొనలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి తెలుగుజాతి ఆత్మగౌరవంటూ మొదలైన టీడీపీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: