గ్రేటర్ ఫలితం తో కాంగ్రెస్ పార్టీ లో కలకలం మొదలైంది.. గత కొన్ని రోజులనుంచి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై పరువు తీసేసుకుంది.. ఇక గ్రేటర్ లో రెండు సీట్లు దక్కించుకుని ఉన్న పరువును పోగొట్టుకుంది..

అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా అవడానికి కారణాలు ఏవీ కనపడంలేదు.. అందరి లాగే వీరు కూడా ప్రచారం చేసినా పార్టీ ని ఎవరు నమ్మలేదు. ఓడిపోయినా ప్రతిసారి నాయకులూ వారిని వారే తిట్టుకోవడంతో ప్రజల్లో మరింత చులకన అయ్యింది పార్టీ.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఇప్పటి పరిస్థితి ఏం చేయాలో తెలియక రాజీనామా చేసేశారు.. ఉత్తమ్ నాయకత్వంలోనే 2018 ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ ముందు నిలవలేక పోయింది. చివరకు తాను గెలిచిన స్థానాలను నిలబెట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది.

నకిరేకల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచిన చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరారు. ఆ సందర్భంగా సొంత జిల్లాలో ఎమ్మెల్యేను కూడా ఉత్తమ్ నిలబెట్టుకోలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఫలితంగా ఉత్తమ్ సొంత నియోజక వర్గంలోనే పట్టుకోల్పోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో పరాభవం కూడా అయన రాజీనామాకు కారణం అయ్యింది. వరుస వైఫల్యాలు, రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉత్తమ్ రాజీనామాను అధిష్టానం ఆమోదిస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందే పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి కి కట్టబెట్టాలని హై కమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీని ఢీ కొట్టే నేతకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: