తెలంగాణ లో కమలం జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఒక్కసారిగా బీజేపీ పార్టీ తెరాస ను తలదన్నే పార్టీ గా అవతరించింది.. దుబ్బాక విజయం గాలివాటమే అనుకున్నా గ్రేటర్ లో మార్పు చూస్తే బీజేపీ పార్టీ ఎంత బలపడిందో చెప్పొచ్చు. ఏకంగా 49 సీట్లు గెలుచుకుని బీజేపీ పార్టీ తెలంగాణ లో ప్రత్యామ్నాయ పార్టీ గా అవతరించబోతుంది. రానున్న రోజుల్లో తెరాస ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తుండంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే గ్రేటర్ లో చాలా చోట్ల బీజేపీ పాగా వేసింది.. ఇకపై నియోజక వర్గాల్లో కూడా కాషాయ రంగు పులమాలని చూస్తుంది..

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విజయం నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. అందుకు ప్రణాళికలను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రూపొందించారు. ఇక గ్రేటర్ లో తెచ్చిన మార్పు సందర్భంగా బండి సంజయ్ కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్‌ అహంకారపూరిత వైఖరిని, అవినీతిని అంతం చేసే పార్టీ బీజేపీయేనని గ్రేటర్‌ ప్రజలు గుర్తించారని అన్నారు..గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ నేతలతో కలసి బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

బీజేపీ విజయాన్ని డీజీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు అంకితం చేస్తున్నామని సంజయ్‌ వ్యాఖ్యానించారు. ప్రజల ఆంక్షల మేరకు బీజేపీ పని చేస్తుందని చెప్పారు. అయితే గ్రేటర్ ఎన్నికల ప్రచార సమయంలో, ఇప్పుడు ఫలితాల సమయంలో బండి సంజయ్ మాటల్లో చాలా మార్పు కనిపించింది.  అప్పుడు నోటికి ఎదోస్తే అదే మాట్లాడే బండి సంజయ్ ఇప్పుడు ఎంతో హుందాగా, హోదాగా మాట్లాడారు.. దుబ్బాక లో గెలిచిన తరువాత కూడా సంజయ్ లో ఈ మార్పు కనపడలేదు.. కేంద్ర నేతల కళ్ళల్లో పడుతున్న సంజయ్ కి ఇది మంచి పరిణామమే..  త్వరలో అధికారంలో కి వస్తామని బండి ఇపుడు ఈ విధంగా  రూటు మార్చారేమో మరీ..

మరింత సమాచారం తెలుసుకోండి: