ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగం ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకప్పుడు కొంత మంది దగ్గర మాత్రమే క్రెడిట్ కార్డు ఉండేది కానీ ప్రస్తుతం ఎంతోమంది క్రెడిట్ కార్డు వినియోగించుకుంటున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రెడిట్ కార్డు సదుపాయం ద్వారా అకౌంట్ లో డబ్బులు లేక పోయినప్పటికీ అన్ని వస్తువులను కొనుగోలు చేయడం వివిధ రకాల కార్యకలాపాలు జరపడం  లాంటివి చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది అనే విషయం తెలిసిందే. ఇక ఆయా బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డు అందించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో... క్రెడిట్ కార్డు  వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.



 సాధారణంగా క్రెడిట్ కార్డు ద్వారా చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు. రీఛార్జ్ లేదంటే బిల్లుల చెల్లింపు కూడా  ఉంటారు అన్న విషయం తెలిసిందే... అంతేకాకుండా రైలు బస్సు ఫ్లైట్ టికెట్ ను కూడా చేస్తూ వుంటారు చాలామంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు. అయితే ఇక ఇప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా రూమ్ రెంట్ కూడా కట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించడం కష్టమని అంటూ ఉంటారు. క్రెడ్, నో  బ్రోకర్  రెడ్ జిరాఫీ వంటి వాటి ద్వారా క్రెడిట్ కార్డు తోనే  రూమ్ రెంట్ కట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక వీటన్నింటికీ కూడా ఝలక్  ఇచ్చేలా ప్రస్తుతం పేటియం సరికొత్త సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.



 క్రెడిట్ కార్డు ద్వారా రూమ్ రెంట్ చెల్లించే సౌకర్యాలు కల్పిస్తూ ప్రస్తుతం సరికొత్త సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది పేటీఎం. అయితే ఇక్కడ ఒక నిబంధన మాత్రం పెట్టింది పేటియం ద్వారా క్రెడిట్ కార్డుతో రూమ్ రెంట్ చెల్లిస్తే మాత్రం రెండు శాతం అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలా క్రెడిట్ కార్డు ద్వారా రూమ్ రెంట్ చెల్లించడం ద్వారా మీకు రివార్డు పాయింట్లు లేదా క్యాష్బ్యాక్ లభించే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు పది వేల రూపాయల ఇంటి రెంట్ చెల్లించినప్పుడు మీ క్రెడిట్ కార్డ్ నుంచి 10200 కట్ అవుతాయి. అయితే యూపీఐ డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రూమ్ రెంట్ కడితే ఎలాంటి అదనపు చార్జీలు పడవు. ఇలా సరికొత్త సర్వీస్ను పేటీఎం తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: