పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమాలపై దృష్టి పెట్టారు.. దాదాపు ఐదు సినిమాలు అయన సెట్స్ మీద ఉంచారు.. ఒకదానికొకటి విభిన్నమైన సినిమాలు కావడంతో ఈ సినిమా లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.. అయితే అయన సినిమాల దృష్టి పెట్టి రాజకీయాలను ఏమాత్రం పక్కన పెట్టలేదు. అడపా దడపా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలను కలకరిస్తున్నారు.. ప్రజా సమస్యలను వింటున్నారు.. ఇటీవలే నివర్ తుపాన్ బాధితులను అయన పరామర్శించిన సంగతి తెల్సిందే..

ఇంతవరకు బాగానే ఉంది కానీ అయన ను బీజేపీ పార్టీ తొక్కేస్తుంది అని ఎందుకు గ్రహించలేకపోతున్నారో అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.. బీజేపీ తో పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ మొత్తం బీజేపీ కి వదిలేయడం వారికి ఏ మాత్రము నచ్చడం లేదట.. జనసేన ప్రతి విషయంలో బీజేపీ డెసిషన్ తీసుకోవడం అభిమానులకు సుతరామూ నచ్చడం లేదు. పవన్ మంచి తనాన్ని అదునుగా తీసుకుని జనసేన ని లేకుండా చేసే విధంగా ప్లాన్ చేస్తుందని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ లో పవన్ కి పోటీ చేద్దామని ఉన్నా బీజేపీ పార్టీ బలవంతంగా పార్టీ మార్పించేసింది.. తిరుపతి చేద్దామని చూస్తుటేనే బీజేపీ వద్దంటూ అడ్డు తగులుతుంది..

పొత్తు అంటే ఒకసారి ఒకరు తగ్గితే ఇంకోసారి ఇంకొకరు తగ్గాలి కానీ ఇక్కడ ఆలా కాదు మొత్తం జనసేన త్యాగం చేస్తూ బీజేపీ బలపడడానికి బలవుతుంది..పోనీ పవన్ చేస్తుందా ఈ త్యాగాన్ని గుర్తిస్తుందా అంటే లేదు. ఆంధ్ర సంగతి పక్కన పెడితే తెలంగాణ‌లో అస‌లు క‌మ‌ల‌నాథులు ప‌ట్టించుకోవ‌డం లేదు. గ్రేట‌ర్ ఎన్నిక‌లో జ‌న‌సేన‌తో పొత్తు ఉండ‌ద‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌కులు ముందుగానే ప్రక‌టించారు. జ‌న‌సేన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రక‌ట‌న ఇది. అందుకే గ్రేట‌ర్ లో పోటీ చేయాల‌ని ముందుగా భావించినా చివ‌రికి జ‌న‌సేన సంయ‌మ‌నం పాటించింది. నిర‌స‌న‌ను మ‌రో రూపంలో ప‌వ‌న్ కల్యాణ్ వ్యక్తప‌రిచారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: