బీజేపీ పార్టీ తెలంగాణ లో సృష్టిస్తున్న ప్రకంపనల సంగతి అందరు చూస్తున్నదే.. ఇప్పటికే అక్కడ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుని తెలంగాణ లో బలపడుతున్న పార్టీ గా సిగ్నల్ పంపింది. అంతేకాదు దుబ్బాక లో విజయంలో వారి ఖాతాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నట్లు అయ్యింది.. నిజానికి ఈ విజయం తోనే వారిలో ఊపు మరింతగా పెరిగిపోయింది. ఆ జోష్ లోనే గ్రేటర్ లో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చేలా పనిచేశారు. ఫలితంగా కేసీఆర్ పై వారు పైచేయి సాధించినట్లు అయ్యింది..

అయితే ఈ పరిణామం ఉత్తరం నుంచి దక్షిణాదికి బీజేపీ గాయాలు బలంగా వీస్తున్నాయని చెప్పొచ్చు.. ఇప్పటికే కర్ణాటక లో తుఫాన్ మాదిరి బీజేపీ అల్లుకుపోయింది.. తెలంగాణ లోనూ తుఫాన్ సృష్టించేందుకు రెడీఅవుతుంది.. ఇక బీజేపీ చూపు ఏపీ పడింది.. నిజానికి ఇక్కడ పిల్లగాలులు ఎప్పటినుంచి వీస్తున్న సోము వీర్రాజు రూపంలో భారీ వర్షం కురుస్తుందని చెప్పాలి.. ఇప్పుడు తెలంగాణ లో పరిణామంతో ఏపీ లో సత్త చాటేందుకు బీజేపీ రెడీ అవుతుంది.  అయితే ఇక్కడ అధికార, విపక్ష పార్టీ రెండు బీజేపీ ముందు మోకరిల్లుతున్నాయి.. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు ఎలాంటి రాజకీయం చేస్తారో చూడాలి..

పోలవరం విషయంలో మోడీ చేస్తున్న అన్యాయాన్ని చూస్తున్న జగన్, చంద్రబాబు ఏమనట్లేదు. అది ప్రజల్లో వీరిపై వ్యతిరేకతను పెంచుతుంది.. బీజేపీ పై సానుకూలత ను కూడా పెంచుతుందని. కేంద్రాన్ని వేలెత్తి చూపకుండా అధికార, ప్రతిపక్షాలు రెండూ కాట్లాడుకోవడం బీజేపీకి, కేంద్రానికి ఆనందాన్నిస్తోంది. టీడీపీ, వైసీపీలు రెండూ కేంద్రాన్ని నిలదీయలేని రాజకీయ నిస్సహాయతలో చిక్కుకున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సైతం ఒకే మాట, ఒకే బాటగా నడిచేందుకు సిద్దపడటం లేదు. శాసనసభ వేదికను వినియోగించుకుని పోలవరం వంటి అత్యవసర ప్రాజెక్టులపై ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదిస్తే మేలు. అటువంటి ప్రయత్నాలు సాగడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడ మూడో పార్టీ కావాలని ప్రజలు భావిస్తే కష్టమే..

మరింత సమాచారం తెలుసుకోండి: