ఉభయ తెలుగు రాష్ట్రములు కలిసి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాబినెట్ లో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు జానారెడ్డి . ఈయన నల్గొండ జిల్లా లోని నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ గారి సారధ్యంలో ఒక మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా మార్పు చెందిందో మీకు తెలిసినదే. తరువాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలు కాగా, కేసీఆర్ సారధ్యంలోని తెరాస ప్రభుత్వం ఏర్పడింది.

అప్పటి నుండి ప్రస్తుతం వరకు తెరాస ఆరు సంవత్సరాలుగా అధికారంలో ఉంది. వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అండగా ఉన్నాయన్నది వాస్తవం. అయితే ఇప్పుడు వారికి ధీటుగా జాతీయ పార్టీ అయిన  బీజేపీ ముచ్చెమటలు పట్టిస్తోంది. మొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో  భాగంగా తెరాస సిట్టింగ్ స్థానాన్ని బీజేపీకి కోల్పోవడం ఒక ఎదురు దెబ్బగా ప్రజలంతా భావిస్తున్నారు. ఇది జరిగి రెండు నెలలు కూడా గడవక ముందే మరో ఛాలెంజ్ ఎదురయింది తెరాస కి, ఈసారి హైదరాబాద్ స్థానిక ఎన్నికలు మాత్రమే. అయినా ఈ ఎన్నికలకు జరిగిన ప్రచారాలు చూస్తే ఇవేదో అసెంబ్లీ ఎన్నికల లాగా అనిపించాయి. బీజేపీ నుండి పెద్ద పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చి ప్రచారాన్ని చేశారు.

అయినా తెరాస మాత్రం ధైర్యంగా మాదే గెలుపు అని భావించారు. చివరికి ఫలితం మాత్రం చాలా దారుణంగా, తెరాస కు పతనం మొదలయిందా  అన్నట్లుగా ఏకంగా 99 నుండి 55 స్థానాలకు పడిపోయింది.  దీనితో బీజేపీ కి త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీద కన్ను పడింది. ఈ నియోజకవర్గానికి సీనియర్ నాయకుడైన జానారెడ్డి ని బీజేపీ లోకి తీసుకుంటే కేసీఆర్ కు చెక్ చెప్పగలడు అని అధిష్టానం భావిస్తోంది. ఇటు జానా రెడ్డి కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. ఏ క్షణమైనా జానా రెడ్డి బీజేపీ లోకి చేరారన్న వార్త రావొచ్చు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: