ఇటీవలే నీవర్  తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది అన్న విషయం తెలిసిందే. తుఫాన్  కారణంగా కురిసిన భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఎంతో మంది రైతులు చేతికొచ్చిన పంట మొత్తం నీటమునిగిపోయి  ధ్వంసం కావడంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే నీవర్  తుఫాను కారణంగా వచ్చిన భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల తో లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది . ఇక చేతికొచ్చిన పంట పూర్తిగా ధ్వంసం కావడంతో రైతులందరూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.



 ఇక ఇదే సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం తుఫాను కారణంగా భారీగా కురిసిన వర్షాలతో పంట నష్టపోయిన రైతులందరికీ పరామర్శిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో  కూడా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడం పై ప్రతిపక్ష అధికార పార్టీ సభ్యుల మధ్య రసాబస జరిగింది అన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ పంట నష్టపోయిన రైతులను కలుస్తూ పరామర్శిస్తారు అన్న విషయం తెలిసిందే.



 అదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ప్రస్తుతం పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు పర్యటన జరుపుతున్నారు. ఇటీవలే గుంటూరు జిల్లా బాపట్ల పచ్చలతాడిపర్రు లో పర్యటించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ క్రమంలోనే ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు ఆయన. అయితే నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో నష్టం నమోదు జరగడం లేదని దీనిపై చట్టసభల్లో ప్రశ్నిస్తే దాడికి పాల్పడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదా అంటూ ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: