ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ టిఆర్ఎస్ పార్టీ ఆశించినంత ఫలితం లేకపోయింది అన్న విషయం తెలిసిందే.  గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన టిఆర్ఎస్ పార్టీ ఈ  జిహెచ్ఎంసి ఎన్నికల్లో కనీసం మ్యాజిక్ ఫిగర్ కు సరిపడామెజారిటీ కూడా సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ మేయర్ను ఎన్నుకోవాలి అంటే ఇతర పార్టీ మద్దతు కూడగట్టుకోవాల్సిన  పరిస్థితి ఏర్పడింది.


 ఎట్టి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు సాధించి తీరుతాం అంటూ టిఆర్ఎస్ నేతలు చెప్పినప్పటికీ 60 సీట్లు కూడా దాట లేకపోయింది టిఆర్ఎస్ పార్టీ.  150 డివిజన్లలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని అంటే 76 స్థానాలు మెజారిటీఉండాలి. అయితే ఎక్స్అఫీషియో సభ్యుల సహకారంతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేయర్ గా  అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.  అయితే ఈ ఏడాది హైదరాబాద్ మేయర్ పదవిని మహిళా అభ్యర్థి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఎవరికీ హైదరాబాద్ మేయర్ అయ్యే అవకాశం ఉంది అనే దాని పై ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో  ఆసక్తికర చర్చ జరుగుతోంది.



 తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భారత్ నగర్ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి గా గెలుపొందిన సింధు ఆదర్శ రెడ్డిని మేయర్ పీఠం వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.  అటు అధికార టీఆర్ఎస్ పార్టీ సింధు రెడ్డిని  మేయర్ పీఠం ఎక్కించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈమె  ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి గెలవడం రెండోసారి. ఇక మెదక్ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి కి సింధు రెడ్డి కోడలు. ఇప్పటికే సింధు రెడ్డికి ప్రగతి భవన్ కు రావాలని పిలుపు అందినట్లు సమాచారం. దీంతో సింధు రెడ్డి కాబోయే హైదరాబాద్ మేయర్ అనే ఊహాగానాలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో  బలంగా వినిపిస్తున్నాయి.  ఇక సింధు రెడ్డితోపాటు మేయర్ బొంతు రామ్మోహన్ భార్య భర్త శ్రీదేవి పేరు కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: