సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏ చిన్న కష్టం వచ్చిన అల్లాడిపోతుంటారు. ఇక ఏ కష్టం వచ్చినా  ఒక అడుగు ముందు ఉండి పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచుతూ ఉంటారు. కానీ కళ్లముందే కన్నబిడ్డలు అల్లాడి పోతుంటే ఆ తల్లిదండ్రుల బాధను మాటల్లో వర్ణించడం కూడా కష్టమే అన్న విషయం తెలిసిందే.  అల్లారుముద్దుగా పెంచుకోవాలనుకున్న కూతురుకి  వింత వ్యాధి వచ్చి  కళ్ల ముందే ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉంటే ఇక ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఎక్కడ తల్లిదండ్రులకు ఇలాంటి బాధ  ఎదురయ్యింది. ఏకంగా ఓ వ్యాధి బారిన పడిన కూతురు రోజురోజుకీ వ్యాధి ముదిరి తీవ్రంగా నరకం అనుభవిస్తుండటాన్ని ఆ తల్లిదండ్రులు చూడలేకపోయారు.  ఈ క్రమంలోనే తమ కూతురికి వచ్చిన వ్యాధి కోసం చికిత్స చేసే స్తోమత  తమ దగ్గర లేకపోవడంతో మరింత కుంగిపోయారు చివరికి కూతురు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు. ఈ నేపథ్యంలోనే తమ కూతురిని ప్రాణాలు తీసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ తల్లిదండ్రులు. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది



 చిత్తూరు జిల్లాలో కోర్టులో మెర్సీ కిల్లింగ్ పిటిషన్ దాఖలైంది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తమ కూతుర్ని చంపేయడానికి కోర్టు తమకు అనుమతి ఇవ్వాలి అంటూ పిటిషన్లో పేర్కొన్నారు యువతి తల్లిదండ్రులు. తమ కూతురికి మెరుగైన వైద్యం చేయించడానికి తమ దగ్గర ఆర్థిక స్తోమత లేదని అలా అని అలాగే వదిలేయాలి అంటే రోజురోజుకు వ్యాధి ముదిరి తమ కళ్లముందే తమ కూతురు నరకం అనుభవించాడాన్ని  చూసి తట్టుకోలేక పోతున్నాము  అంటూ పిటిషన్లో పేర్కొన్నారు తల్లిదండ్రులు.  అందుకే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని తమ కూతురు ని చంపడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: