గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో రాజకీయ పార్టీలకు ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి.55 సీట్లతో టి‌ఆర్‌ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆ పార్టీలో సంతోషం లేనట్టే కనిపిస్తుంది.ఇక బి‌జే‌పి విషయానికొస్తే 4 స్థానాలనుండి 48 స్థానాలకు చేరి టి‌ఆర్‌ఎస్ కు ధీటైన ప్రత్యర్థిగా అవతరించింది.

ఇక ఎంఐఎం విషయానికొస్తే తమ సత్తా ఏమాత్రం తగ్గలేదని మరొకసారి నిరూపించింది.44 స్థానాల్లో విజయం సాధించి మూడో అతిపెద్ద పార్టీగా నిలిచింది..గ్రేటర్ ఫలితాలపై   హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...గ్రేటర్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చిన అర్థం చేసుకోవాలని, గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.

టి‌ఆర్‌ఎస్ తో పొత్తు విషయమై ఒవైసీ స్పందిస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా ప్రకటించిన వెలువడిన తర్వాత పార్టీలో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.. జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత టీఆర్ఎస్ నుండి పొత్తు విషయమై ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం ఒవైసీ స్పష్టం చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: