వరద బాధిత ప్రాంతాల్లో మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసారు. రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. ఇక రైతులు కూడా ఆయనకు తమ బాధలు వినిపించారు. కారంచేడులో రైతుల రచ్చబండ కార్యక్రమం జరిగింది. నివర్ తుఫాను వలన పూర్తిగా నష్టపోయామని తమ ఆవేదన వ్యక్తం చేసిన మిర్చీ రైతులు... రైతు భరోసా కేంద్రాల్లో కంటే బయట మార్కెట్లోనే తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు దొరుకుతున్నాయి అన్నారు. కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారు. కౌలు, పెట్టుబడి పోయి పూర్తిగా అప్పుల పాలయ్యాం అని ఆవేదన వ్యక్తం చేసారు. కౌలు రైతులకు భరోసా అందడం లేదు అన్నారు.

ఇక నారా  లోకేష్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రైతు రాజ్యం తెస్తా అన్న జగన్ రెడ్డి రైతు లేని రాజ్యం తీసుకొస్తున్నాడు అని మండిపడ్డారు. భరోసా పెద్ద మోసం 12500 ఇస్తా అని కేవలం 7500 ఇస్తున్నారు అన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఎవరూ సంతోషంగా లేరు అని ఆయన విమర్శించారు. సామాన్య ప్రజలను పీడిస్తున్నారు అన్నారు. పెద్ద వాలంటీర్ వ్యవస్థ ఉంది అంటున్నారు మరి నష్టం అంచనా ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఆయన నిలదీశారు. సున్నా వడ్డీ పేరుతో రైతుల్ని దగా చేస్తున్నారు అన్నారు.

ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఇన్స్యూరెన్సు కడతామా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వం పంట నష్టం జరిగాకా ఇన్స్యూరెన్సు కడుతుంది  అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, భీమా కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమయ్యింది అని ఆయన ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు మంత్రులను కొడుతున్నారు అని, మోటర్లకు మీటర్లు పెడతా అంటే రైతులు వైకాపా నాయకుల్ని తరిమికొట్టడం ఖాయం అన్నారు. మీటర్లు పెట్టే కార్యక్రమం ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేసారు. లేకపోతే మీటర్లు పగలగొడతాం అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: