తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాజకీయంగా ఎలా ఆ పార్టీ పరిస్థితి ఉంటుందో అర్ధం కావడం లేదు. పార్టీలో ఉన్న కీలక నేతలు బయటకు వెళ్ళే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశం ఉంది అని అంటున్నారు. దీనిపై కొండా స్పందించారు. పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి... సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ టి.ఆర్.ఎస్. తో కలిస్తే బీజేపీలో చేరతా అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీలో నిర్మాణాత్మక మార్పులు జరగాలి అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ నేతల భాష మారాలి అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కు పదునైన భాషతోనే బదులు చెప్పే కాంగ్రెస్ నేతలు కావాలి అని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ కుటుంబ మీడియా సంస్థలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించాలి అని ఆయన డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతుల్యత పాటించాలి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కెసిఆర్ దగ్గర చిన్న లాఠీ ఉంటే బిజెపి దగ్గర పెద్ద కర్ర ఉంది అందుకే ప్రజలు బిజేపి వైపు చూస్తున్నారు అని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించడంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది అని ఆయన విమర్శలు చేసారు.

కాంగ్రెస్ పార్టీ మూస ధోరణి వీడాలి అని ఆయన సూచనలు చేసారు. ఎవరికి పిసీసీ ఇచ్చిన అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అని ఆయన సూచనలు చేసారు. కాంగ్రెస్ పార్టీ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు అని ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలపై కెసిఆర్ జేబులో మనుషులు అన్న అపవాదు ఉంది అని, ఆ పార్టీ వాళ్ళతో లాలూచీ పడితే నేను ఇంకా పార్టీలో కొనసాగను అని, కెసిఆర్ అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ కోర్టుల్లో  కేసులు పెట్టాలి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: